బాహుబలిలో మెరవనున్న నోరా ఫతేహి

బాహుబలిలో మెరవనున్న నోరా ఫతేహి

Published on Mar 27, 2015 2:24 PM IST

nora-fatehi
తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలను పెంచుకుంటుంది. తాజా కధనాల ప్రకారం ప్రముఖ నర్తకి నోరా ఫతేహి ఈ సినిమాలో నటిస్తుంది. ఈ భామ ఇటీవలే ‘టెంపర్’ లో ఐటెం సాంగ్ లో నటించింది.

బాహుబలి సినిమాలో నోరాని ఒక ప్రత్యేక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. గత రెండేళ్ళగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర దశలో వుంది. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ లో విడుదలకానుంది. మే 15న ఈ మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు