రెహమాన్ సినిమాకు.. దర్శకుడు దొరికాడు!

రెహమాన్ సినిమాకు.. దర్శకుడు దొరికాడు!

Published on Apr 7, 2015 2:05 AM IST

ar-rehman
ఏ.ఆర్.రెహమాన్.. భారతీయ సినీ అభిమానులకు ఎన్నో ఏళ్ళుగా పరిచితమైన ఈ పేరు గతకొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందింది. తన అసాధారణ సంగీత ప్రతిభతో ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న రెహమాన్ నిర్మాతగా మారనున్న విషయం ఇంతకుముందే తెలియజేశాం. తాజాగా ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న ప్రశ్నకు సమాధానం కూడా దొరికేసింది.

విశ్వేష్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సంగీత కళాకారుడు, స్టేజ్ ఆర్టిస్ట్ కూడా అయిన విశ్వేష్ గతంలో ఆమిర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ టీవీ షో కోసం ప్రోమోలు రూపొందించాడు. ఎరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాడు రెహమాన్. హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంల్ రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లోకి డబ్ చేయనున్నారు. ఈ సినిమాకు రెహమాన్ స్వయంగా స్టోరీ, స్క్రీన్‌ప్లేలను రాయడం విశేషం. అయితే ఈ సినిమాకు రెహమాన్ సంగీతం కూడా సమకూరుస్తాడా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా లాంచ్ జరగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు