మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు తన చేతిలో పలు సినిమాలు ఉండగా వీటికి కొంత బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తన పర్శనల్ లైఫ్ లో బిగ్ స్టెప్ తీసుకోబోతున్నాడు. ఇటీవల శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాము కలిసి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులకు వెళ్లి పెళ్లి ఆహ్వానాన్ని కూడా అందించారు.
ఇక ఫైనల్ గా తమ పెళ్లి వేడుకకి సంబంధించిన డేట్ మరియు వేదిక ఇప్పుడు రివీల్ అయ్యాయి. ఈ ఏప్రిల్ 29న ఉదయం 11 గంటల 13 నిమిషాలకి తిరుమల సన్నిధి వేదికగా సనాతన ధర్మ సంప్రదాయాల్లో శ్రీనివాస్, కావ్యాల కళ్యాణం జరగనుంది. ఇక ఈ మహోత్సవ వేడుక అనంతరం ఈ మే 1న భాగ్యనగరంలో గ్రాండ్ గా రిసెప్షన్ ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రిసెప్షన్ కి దేశ వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులూ హాజరు కానున్నారు.
ఇక ఈ సాంప్రదాయక వేడుకకు విశిష్టమైన హుందాతనాన్ని జోడిస్తూ, ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ వధూవరుల కోసం ప్రత్యేకమైన దుస్తులను రూపొందించారు. తిరుమల దివ్య సన్నిధిలో వధూవరుల రాజసం ఉట్టిపడేలా, ప్రాచీన భారతీయ సంప్రదాయ సౌందర్యాన్ని మరియు ఆధునిక హంగులను ఆయన తన నైపుణ్యంతో అద్భుతంగా కలబోశారని తెలుస్తుంది.


