
‘కిక్’.. రవితేజను తెలుగు తెరకు డిఫరెంట్గా పరిచయం చేసి సూపర్ హిట్ కొట్టిన సినిమా. ఇప్పుడా సినిమాకు సీక్వెల్గా ‘కిక్ 2’ రూపొందుతోన్న విషయం తెలిసిందే! కిక్ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డియే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
తాజాగా ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం ప్రముఖ హాలీవుడ్ భామ నోరా ఫతేహిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట షూటింగ్ కూడా జరగనున్నట్లు సమాచారం. ఇక నోరా ఫతేహి ఈ మధ్యే విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘టెంపర్’ సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా మెప్పించింది. ఆ తర్వాత బాహుబలి సినిమాలోనూ ఓ సాంగ్కు ఎంపికైంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న ‘కిక్ 2’ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదల కానుంది.

