
అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే . ఈ సినిమాను హీరో నితిన్ నిర్మింస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన సయేషా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను అఖిల్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు . పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్, అనూప్ రూబెన్స్ ఇద్దరూ సంగీతం సమకూర్చనుండడం విశేషం.

