మరోసారి జతకట్టనున్న నాగాచైత్యన, సమంతా

మరోసారి జతకట్టనున్న నాగాచైత్యన, సమంతా

Published on Apr 7, 2015 9:48 PM IST

Naga-Chaitanya-Samantha
‘ఏం మాయచేసావే’ సినిమాతో పరిచయమైన 5 ఏళ్ళగా కుర్రకారు ఎదలను కొల్లగొడుతున్న భామ సమంత. నాగచైతన్య జోడీగా ఈ సినిమాతో మరపురాని డెబ్యు చేసింది. వీరి కాంబినేషన్ సూపర్ హిట్ కావడంతో మనం, ఆటో నగర్ సూర్య సినిమాలలో మనల్ని అలరించారు. తాజాసమాచారం ప్రకారం చందూ మొందేటి దర్శకత్వంలో మరోసారి జతకట్టనున్నాడు.

కార్తికేయ విజయానంతరం చందూ తో చైతన్య ఒక సినిమా తీయనున్న విషయం మేము ముందుగానే తెలిపాం. పకడ్బందీ స్క్రిప్ట్ కోసం చందూ తగినంత సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు