సీక్వెల్ కోసం సిద్ధపడుతున్న సిద్ధార్ద్, త్రిష

సీక్వెల్ కోసం సిద్ధపడుతున్న సిద్ధార్ద్, త్రిష

Published on May 7, 2015 12:37 AM IST

Trisha-and-Siddharth
నటి త్రిషకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. తమిళ, తెలుగు అంటూ బాషకు సంబంధం లేకుండా సినిమాలపై సంతకం చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు ప్రాజెక్ట్ లు వున్నాయి.
ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా ‘అర్నమయి 2’ చిత్రంలో నటిస్తున్నట్టు ఖరారు చేసింది. ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వం వహించనున్నారు. సిదార్ద్ కధానాయకుడు. దీని మొదటిభాగం సూపర్ హిట్ అయిన
సంగతి తెలిసినదే.

ముందుగా త్రిష పాత్రకోసం హన్సికని సంప్రదించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా త్వరలో ప్రారంభంకానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాల తరువాత త్రిష,
సిద్ధార్ద్ మూడవసారి జతకట్టనున్నారు.

తాజా వార్తలు