టీటీడీ బోర్డు మెంబర్‌గా రాఘవేంద్రరావు ప్రమాణం

టీటీడీ బోర్డు మెంబర్‌గా రాఘవేంద్రరావు ప్రమాణం

Published on May 7, 2015 12:30 PM IST

raghavendar-rao

తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల చేత దర్శకేంద్రుడిగా పిలిపించుకున్న స్టార్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. భక్తిరస చిత్రాలు తీయడంలో తనకెవరూ సాటిలేరని ఆయన చాలాసార్లు నిరూపించుకున్నారు. తాజాగా ఆయన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఆ పదవికి రాఘవేంద్రరావు ప్రమాణం స్వీకారం చేశారు. టీటీడీ బోర్డు నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆయన ఈ ప్రమాణం చేశారు.

ఇక బోర్డు మెంబర్‌గా ప్రమాణం చేసిన అనంతరం కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. తనకు అందివచ్చిన ఈ అవకాశంతో దేవస్థానం అభివృద్ధి కోసం పాటు పడతానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణిలు పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి రాఘవేంద్రరావు స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం సేవించారు.

తాజా వార్తలు