మెగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న త్రిష?

మెగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న త్రిష?

Published on May 9, 2015 4:06 PM IST

trisha
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తాజా చిత్రం కోసం అందాల భామ త్రిషను ఎంపిక చేసుకున్న విషయం మేము ముందుగానే తెలిపాం. ఈ సినిమాలో శింబు హీరో. తాప్సీ మరొక నాయిక. ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సివుండగా తాజాగా వీరి నడుమ ఒక ఫోటో షూట్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించే పనిలో వున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలను సమకూరుస్తున్నారు.

అయితే ఫిలింనగర్ వాసుల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బిజీ షెడ్యూల్ కారణంగా త్రిష వదులుకోనుందట. తమిళంలో వరుసపెట్టి ఆఫర్లను అంగీకరిస్తూ పోతూ ఇప్పుడు దాదాపు 5 చిత్రాలు ఆమె చేతిలో వున్నాయట. దీనికారణంగా శింబు చిత్రాన్ని వదులుకోనుందని సమాచారం. అయితే ఈవార్త పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సివుంది.

తాజా వార్తలు