
టాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ రేంజ్ ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్ళడం కోసం ఎస్ఎస్ రాజమౌళి గత రెండేళ్లుగా ఎంతో శ్రమించి తీస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమా ట్రైలర్ ని మే 31న రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసారు. కానీ తాజాగా ఈ చిత్ర టీం ట్రైలర్ రిలీజ్ డేట్ ని ఆడియో రిలీజ్ డేట్ గా కూడా మార్చేసింది. మే 31న ఆడియో రిలీజ్ ని కూడా బాగా గ్రాండ్ గా చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.
హైదరాబాద్ లోనే సరికొత్తగా ఈ మూవీ ఆడియో రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ లోపు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ రోజు మార్చి రోజు ఈ చిత్ర టీం నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన అన్ని పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి జూలై 10న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

