జార్జియా వెళ్ళిన వరుణ్ తేజ్ ‘కంచె’

జార్జియా వెళ్ళిన వరుణ్ తేజ్ ‘కంచె’

Published on May 12, 2015 4:47 PM IST

kanchae
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ఆరడుగుల యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన రెండవ సినిమా ‘కంచె’ షూటింగ్ లో బిజీగ ఉన్న సంగతి మనకు తెలిసిందే. గమ్యం, వేదం ఫేం క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చిలో ప్రారంభమైన ఈ సినిమాని అప్పుడే చివరి దశకు తీసుకు వచ్చేశారు. మొదట రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ఓ భారీ హౌస్ సెట్ లో షూట్ చేసిన ఈ చిత్ర టీం ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని తాటిపాక పరిసర ప్రాంతాల్లో మేజర్ షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేసారు.

లోకల్ షెడ్యూల్స్ అన్నీ పూర్తి చేసుకున్న కంచె చిత్ర టీం చివరి షెడ్యూల్ కోసం జార్జియా బయలు దేరారు. ఈ షెడ్యూల్ లో భాగంగా కొన్ని పాటలను, కొన్ని సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ జార్జియా షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. వరుణ్ తేజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఒక ఎపిసోడ్ స్వాతంత్ర్యం రాకముందు ఉంటుంది. ఈ సినిమాకి సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఈ చిత్ర టీం ఉంది.

తాజా వార్తలు