
సినీ పరిశ్రమలో సినిమా జయాపజయాలను బట్టి పెట్టుబడి పెట్టే నిర్మాతలకి లాభ నష్టాలు వస్తుంటాయి. సినిమా మంచి విజయం సాధిస్తే అన్నిటి పరంగా లాభం ఉంటుంది. అదే నష్టం వస్తే చాలా దగ్గర నష్టపోవలసి వస్తుంది. ఇన్ని నష్టాల్లో కూడా ఇన్ని రోజులు నిర్మాతలను కాస్తో కూస్తో సేవ్ చేస్తూ వస్తున్న విషయం శాటిలైట్ రైట్స్. ఒకప్పుడు శాటిలైట్ రైట్స్ కి బాగా డిమాండ్ ఉండేది.. చెప్పాలంటే కొంతమంది శాటిలైట్ రైట్స్ కోసం సినిమాలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ డిమాండ్ తగ్గిపోయింది. సినిమా పెద్ద హిట్ అయితే ఆ సినిమాకి భారీగానే శాటిలైట్ రైట్స్ పలుకుతున్నాయి, లేదా పెద్ద హీరో సినిమా అయితే శాటిలైట్ రైట్స్ కోసం టీవీ వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు.
కానీ ఈ మధ్య కాలంలో శాటిలైట్ రైట్స్ కి డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని నిర్మాతల ముందు ఉంచితే వరు చెబుతున్న మాటలు ఇవే.. ‘ దాదాపు గత రెండేళ్లుగా శాటిలైట్ రైట్స్ బిజినెస్ చాలా పడిపోయింది, మీడియం బడ్జెట్, లో బడ్జెట్ సినిమాల శాటిలైట్ రైట్స్ ససలు అమ్ముడు పోవడం లేదు. ఇప్పటి వరకూ నిర్మాత శాటిలైట్ రైట్స్ ని కూడా జత చేసుకొని సినిమాకి ఎంత పెట్టాలి, ఎంత పెడితే నష్టపోము అని బడ్జెట్ వేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అసలు శాటిలైట్ రైట్ ని అసలు లెక్కలో వేసుకోలేని పరిస్థితి.. అందుకే ఖర్చు తగ్గించుకొని సినిమా తీయాల్సి వస్తోందని’ నిర్మాతలు వాపోతున్నారు. మరి దీనికి కారణం బడ్జెట్ లు పెరిగిపోవడమా.? లేక సినిమాలు ఎక్కువ అయిపోవడమా.? లేక శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానళ్ళు ఎక్కువ పెట్టేసి నష్టపోవడమా? అనే విషయాలపై చర్చలు జరిపి చిన్న సినిమాల నిర్మాతలు కాస్తన్నా సేవ్ అవ్వుదాం అని అనుకుంటున్నారు.

