చిరు సినిమా కోసం ఎప్పట్నుంచో వెయిటింగ్ : బన్నీ

చిరు సినిమా కోసం ఎప్పట్నుంచో వెయిటింగ్ : బన్నీ

Published on May 12, 2015 7:32 PM IST

chiru-allu-arjun
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరు 150వ సినిమా ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్ ఇప్పటికే తెలియజేశారు. ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారట. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

చిరంజీవి 150వ సినిమా గురించి అల్లు అర్జున్ “చిరంజీవి గారి 150వ సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ద కింగ్ ఈజ్ బ్యాక్. ఈ సినిమాకు ఏవైనా టైటిల్స్ చెప్పండి” అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే చిరు 150వ సినిమాకు ‘ఆటోజానీ’ అన్న పేరును ఖరారు చేయగా అల్లు అర్జున్ కొత్త పేర్లు కోరడం పట్ల అభిమానులు అయోమయానికి గురయ్యారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి, గోపీ మోహన్‌లు స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.

తాజా వార్తలు