నెగటివ్ రోల్స్ చేయనంటున్న టాప్ హీరోయిన్

నెగటివ్ రోల్స్ చేయనంటున్న టాప్ హీరోయిన్

Published on May 13, 2015 8:26 AM IST

kajal-agarwal

‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు చిత్ర సీమకి పరిచయమై ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ‘మగధీర’ సినిమాతో స్టార్డం తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారింది కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ట్రీకి పరిచయమై 10 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ పదేళ్ళలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలో పదేళ్ళు సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నందుకు కాజల్ చాలా హ్యాపీ గా ఉంది.

‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంటానని, ఇన్ని సినిమాలు చేస్తానని ఊహించలేదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ అంటోంది’ కాజల్ అగర్వాల్. ఇప్పటి వరకూ అటు బబ్లీ బాబ్లీ గర్ల్ గా, గ్లామరస్ హీరోయిన్ గా, నటనకు ప్రాధాన్యం పాత్రల్లో కాజల్ నటించింది. ఇన్ని చేసిన కాజల్ నెగటివ్ రోల్స్ మాత్రం చేయనంటోంది. ‘నాకు నెగటివ్ రోల్స్ చేయడం అస్సలు ఇష్టం లేదు. నేను కరుణ,దయ లేకుండా బిహేవ్ చేసే రౌడీ రాణి, విలన్ పాత్రలకు నేను సెట్ అవ్వను, అలాగే ప్రేక్షకులు నన్ను అలా చూడలేరని’ కాజల్ అంటోంది. ఈ ఏడాది తెమప్ర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంది.

తాజా వార్తలు