గాడ్సే కోసం 7 కేజీలు తగ్గిన బాలయ్య

గాడ్సే కోసం 7 కేజీలు తగ్గిన బాలయ్య

Published on May 13, 2015 3:20 PM IST

balakrishna

నందమూరి బాలకృష్ణ ఇటు హీరోగా, అటు రాజకీయ నాయకుడిగా తన పనులను తానూ సక్రమంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆయన ఏ పని చేసినా 100% డెడికేషన్ తో చేస్తాడు. ఒక సినిమాకి సైన్ చేసాడు అంటే ఆ సినిమాలో పాత్ర ఎలా కోరుకుంటే అలా మారిపోతాడు బాలకృష్ణ. నూతన దర్శకుడు సత్య దేవా డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ చేసిన సినిమా 98వ సినిమా ‘లయన్’. ఈ సినిమాలో బాలకృష్ణ బోస్ మరియు గాడ్సే అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలకి మధ్య వేరియేషన్ ఉండాలని డైరెక్టర్ కోరాడు.

డైరెక్టర్ కోరినట్టే పాత్రలకి న్యాయం చేయడం కోసం బాలకృష్ణ 4 నెలల పాటు తన నోరును కట్టేసుకొని ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ గాడ్సే పాత్ర కోసం 7 కేజీల బరువు తగ్గాడని డైరెక్టర్ సత్య దేవా తెలియజేశాడు. అంతే కాకుండా బాలకృష్ణ ఎంతో ఇష్టపడి చేసిన గాడ్సే పాత్ర ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, లయన్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని తెలిపాడు. లయన్ సినిమా రేపు అనగా మే 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

తాజా వార్తలు