
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీ మంతుడు'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మలేషియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 80% పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. మొదట ఈ సినిమాలోని నటీనటులు తమ పాత్రలకు సంబందించిన డబ్బింగ్ చెబుతారు. త్వరలోనే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని మొదలు పెడతారు.
డబ్బింగ్ తో పాటు ఎడిటింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు మహేష్ బాబు ఈ చిత్ర నిర్మాతలైన మైత్రి మూవీస్ వారితో మాట్లాడి అనుకున్న దాని ప్రకారం జూలై 17న ఈ సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. మహేష్ బాబు సరసన మొదటి సారి శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిర్చి ఫేం కొరటాల శివ దర్శకుడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ని మే 31న రిలీజ్ చేయనున్నారు.

