‘లయన్’ ఫస్ట్‌ డే కలెక్షన్స్ రిపోర్ట్

‘లయన్’ ఫస్ట్‌ డే కలెక్షన్స్ రిపోర్ట్

Published on May 15, 2015 1:45 PM IST

lion-record

‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొత్త దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లయన్’. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మించారు. భారీ అంచనాల మధ్య నిన్న (మే 14న) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌ని కొల్లగొట్టింది.

బాలయ్య మార్క్ యాక్టింగ్, డైలాగులకు విపరీతమైన స్పందన వస్తోంది. మాస్ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలూ మెండుగా ఉన్న ఈ సినిమా బాలయ్య మార్కెట్ బలంగా ఉన్న ప్రాంతాల్లో మొదటి రోజు మంచి కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.5.52కోట్లు సాధించింది. ప్రాంతాల వారీగా కలెక్షన్ల వివరాలిలా ఉన్నాయి.

ఏరియా కలెక్షన్స్
నైజాం : 1.47కోట్లు
సీడెడ్ : 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర : 49.13 లక్షలు
ఈస్ట్ : 43 లక్షలు
వెస్ట్ : 45 లక్షలు
కృష్ణా : 44.76 లక్షలు
గుంటూరు : 72 లక్షలు
నెల్లూరు : 333.19 లక్షలు

నిన్న సెలవురోజు కాకపోయినా ఈ స్థాయి కలెక్షన్లు రావడం ‘లయన్’ సినిమాకు గల క్రేజ్‌ను ఋజువు చేసింది. ఇక రెండో రోజు కూడా కలెక్షన్లు స్ట్రాంగ్‌గానే ఉన్నాయని తెలుస్తోంది. మొదటి వారాంతం సినిమా మంచి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాల సమాచారం.

తాజా వార్తలు