ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో కుర్రహీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య నటించిన లయన్ నిన్నే విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. బాలయ్య మార్క్ యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే.. అప్పుడే బాలయ్య తన తరువాతి సినిమా కోసం సిద్ధమైపోవడం విశేషం. బాలీవుడ్‌లో పేరొందిన పెద్ద నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. బాలయ్య కెరీర్లో 99వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పట్నుంచే మంచి క్రేజ్ ఉది.
‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మే 29న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరగనున్నాయి. తాజాగా ఈ సినిమాకు ఓ పవర్ఫుల్ టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్‌కు సరిపోయేలా ఈ సినిమాకు ‘డిక్టేటర్’ అనే పేరును దాదాపుగా ఖరారు చేశారు. ఇక తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లైన కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు కలిసి పనిచేయడం విశేషంగా కనిపిస్తోంది. అంజలిని ఈ సినిమాకు హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.


