తిరిగి తెరపై సందడి చేయనున్న స్టార్ జోడి

తిరిగి తెరపై సందడి చేయనున్న స్టార్ జోడి

Published on May 21, 2015 11:28 PM IST

surya-jyothika
దాదాపు దశాబ్ద కాలం క్రిందట తమిళనటుడు సూర్య – అందాల భామ జ్యోతికల జోడి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. 2006లో ఈ జోడి నిజజీవితంలో సైతం జోడిగా మారిన తరువాత జ్యోతిక సినిమాలకు పాజ్ బటన్ నొక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ జంట తిరిగి వెండితెరపై సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్నారు.

దాదాపు ఐదుగురు దర్శకుల స్క్రిప్ట్లను విన్న సూర్య, జ్యోతికలు వాటిలో రెండిటిపై మక్కువ చూపించారట. వీటిని మరింత పకడ్బందీగా చేసుకురమ్మని కొన్ని నెలల గడువుని కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లోగానీ వచ్చే యేడు మొదట్లో గానీ ఈ సినిమా ప్రారంభంకానుంది.

ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక మంచి విజయాన్ని రుచిచూస్తే సూర్య మాస్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

తాజా వార్తలు