
తెలుగు తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే యంగ్ హీరోల సినిమాలకి కూడా మ్యూజిక్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ప్రత్ ఆల్బంలోనూ రెండు మూడు చార్ట్ బస్టర్స్ అన్నా ఇచ్చే తమన్ చాలా వేగంగా మ్యూజిక్ ని ఫినిష్ చేస్తుంటాడు. అంతే కాకుండా చాలా వరకూ తన సినిమాలో నటించే హీరో, హీరోయిన్స్ చేత పాటలు పాడించి వారి అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఇదే విధంగా ఇప్పుడు తమన్ నందమూరి బాలకృష్ణ అభిమానులను ఓ సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. ఈ సినిమాకి తమ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ ఈ సినిమాకి సంబందించిన మ్యూజిక్ కంపోజింగ్ మొదలు పెట్టాడు. తమన్ ఈ సినిమాలో ఓ పాటని బాలకృష్ణ చేత పాడించాలని అనుకున్నాడు, ఇదే విషయాన్ని ఆయన ముందు ఉంచితే ఆయన కూడా కాస్త సముఖత చూపినట్లు సమాచారం. బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా పాట పాడే విషయంలో ఆసక్తిని కనబరుస్తున్నారట. మరి బాలయ్య తమన్ కోరికని మన్నించి పాట పాడతాడా లేక హీరోగా మాత్రమే ఉంటాడా అన్నది తెలియాల్సి ఉంది.
ఇటీవలే జరిగిన మేము సైతం ప్రోగాం లో బాలకృష్ణ రెండు పాటలు పాడి అందరినీ మెప్పించిన విషయం మనకు తెలిసిందే.. శ్రీ వాస్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా నటించనున్నారు.

