దక్షిణాదికి సినిమా తారల్లో ఇప్పుడున్న జెనరేషన్ కి ఏ స్టార్ హీరో చూడని పొలిటికల్ వెల్కమ్ ని ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు చూసారు. తమిళనాట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిస్టారికల్ విజయాన్ని సాధించి మొదటిసారి పోటీలోనే రికార్డు సెట్ చేశారు. అయితే విజయ్ విక్టరీపై అనేకమంది టాలీవుడ్ సినిమా ప్రముఖులు కూడా తమ బెస్ట్ విషెస్ తెలిపారు.
అయితే విజయ్ భారీ విజయంపై మాట్లాడుతూ ఇది సినిమాకి ఉన్న ‘పవర్’ అంటూ నొక్కి చెప్పడం వైరల్ గా మారింది. ఇది సినిమా చెయ్యగలదు, సిస్టంని జనాన్ని కదిలిస్తుంది, అలాగే పవర్ లోకి కూడా తీసుకొస్తుంది. విజయ్ గారికి అలాగే తన పార్టీ తమిళగ వెట్రి కళగం లకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ సందీప్ రెడ్డి వంగ చేసిన పోస్ట్ అటు తమిళ ఆడియెన్స్ తో పాటుగా ఇటు తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి వైరల్ గా మారింది.
This is what CINEMA can do, it can move people, shake systems, and turn presence into POWER. Here CINEMA stepping off the screen and owning the ground. Not hype. Not noise. Real power…. 🔥
My deepest heartfelt congratulations to @actorvijay sir and Tamilaga Vettri Kazhagam. 🙏— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 4, 2026


