నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 111వ సినిమాని దర్శకుడు గోపిచంద్ మలినేనితో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్ 112వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో అనౌన్స్ చేయగా దీనికి భారీ హైప్ వచ్చింది. ఇక ఈ సినిమా కూడా త్వరగానే కంప్లీట్ చేసి వచ్చే ఏడాది దింపనున్నారు.
అయితే ఈ సినిమా ముహూర్తం ఇప్పుడు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ మే 9న సినిమా అధికారికంగా ముహూర్త కార్యక్రమాలతో లాంచ్ కానున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య, నందమూరి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి యువసుధ ఆర్ట్స్ మరియు ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


