‘బాహుబలి’.. తెలుగు సినిమా గర్వకారణం : అల్లు అర్జున్

‘బాహుబలి’.. తెలుగు సినిమా గర్వకారణం : అల్లు అర్జున్

Published on Jul 7, 2015 5:57 PM IST

Allu-arjn
ఇప్పుడు ఏ సినీ అభిమాని మాట్లాడినా అది తిరిగి తిరిగి ‘బాహుబలి’ గురించే అయి ఉంటోంది. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ఇటు అభిమానులు, సాధారణ ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేయడమే కాకుండా తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాగా బాహుబలి నిలుస్తుందన్న అభిప్రాయాలు ఇప్పట్నుంచే వ్యక్తమవుతున్నాయి.

గత కొద్ది రోజుల క్రితం బాహుబలి లాంటి సినిమా తెలుగులో రావడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి మహేష్ బాబు ‘బాహుబలి’ సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమాకు గర్వ కారణమంటూ ట్వీట్ చేశారు. “బాహుబలి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ స్థాయిలో ఓ తెలుగు సినిమాను చూడడం నిజంగా గర్వంగా ఉంది. బాహుబలి ఓ సినిమా కాదు.. అది తెలుగు సినిమా గర్వం. ప్రభాస్, రానాలు తమ కెరీర్లోనే అత్యున్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నా. తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ బాహుబలి గురించి బన్నీ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు