ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్, స్టార్డం ప్రకారం చూసుకుంటే.. ఒక హీరోయిన్ ఒక భాషలో స్టార్డం తెచ్చుకొని అక్కడి స్టార్ హీరోస్ తో సినిమాలు చేయడమే ఓ పెద్ద అచీవ్ మెంట్. కానీ ఒక హీరోయిన్ ఒకే సారి సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకొని స్టార్ హీరోస్ తో సినిమాలు చేయడమే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని సొంతం చేసుకోవడం అనేది అంత సులువు కాదు. కానీ అలాంటి అరుదైన అవకాశం కొట్టేసిన హీరోయిన్ శృతి హాసన్. తను ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా మల్టీ టాలెంట్ అయిన శృతి హాసన్ ఖాళీ సమయాల్లో సింగర గా కూడా పాటలు పాడుతోంది.
ఈ అందాల భామ తాజాగా ప్రొడక్షన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తన ప్రొడక్షన్ హౌస్ కి ఇసిడ్రో(Isidro) నే పరు కూడా పెట్టింది. ముందుగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, మ్యూజికల్ ఆల్బమ్స్, యానిమేషన్, డిజిటల్ – మల్టీ మీడియా కంటెంట్ ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ చెయ్యడానికి ఆసక్తి చూపుతోంది. భవిష్యత్తులో ఎంటర్ టైన్మెంట్ రంగం షార్ట్ ఫిల్మ్స్ అండ్ డిజిటల్ కంటెంట్ వైపు ఎక్కువ వెళ్తుందనిఅందుకే తన ప్రొడక్షన్ ని అటువైపు తీసుకెళ్ళే ఆలోచనలో ఉంది. వీటితో పాటు ఫ్యూచర్ లో సినిమా ప్రొడక్షన్ వైపు కోడా రావాలనే ప్లాన్ లో ఉంది శృతి హాసన్. ఇదిలా ఉంటే శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.


