
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ సినిమా అంటే పక్కా మాస్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోవచ్చు.. ఆయన కథలకి, హీరో పాత్రలకి దీటుగానే ఆయన సినిమా టైటిల్స్ కూడా ఉంటాయి. పోకిరి, దేశముదురు, నేనింతే లాంటి టైటిల్స్ తరహాలోనే పూరి యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ తో చేసిన సినిమాకి ‘లోఫర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ని ‘మా అమ్మ మహాలక్షి’గా మార్చే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్ర టీం షూటింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్పీడ్ గా ఫినిష్ అవుతుండడం వలన ఈ సినిమాని రిలీజ్ కోసం ఓ సరైన రిలీజ్ డేట్ ని పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర టీం చెప్పిన సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అలాగే నవంబర్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. పూర్తి మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా కావడం వలన లోఫర్ అనే టైటిల్ ని మార్చే ఆలోచనలో ఉన్నారు. వరుణ్ తేజ్ సరసన దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ త్వరలోనే ఈ టైటిల్ మరియు రిలీజ్ డేట్స్ గురించి తెలియజేయనున్నారు.

