‘అఖిల్’ సినిమా వాయిదాపై నాగ్ వివరణ

‘అఖిల్’ సినిమా వాయిదాపై నాగ్ వివరణ

Published on Oct 16, 2015 10:20 AM IST

nagarjuna
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి ఎంట్రీ ఇస్తోన్న అఖిల్ మొదటి సినిమా, ఈ దసరా సీజన్‌కు ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్ధమై చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అక్టోబర్ 22న దసరా కానుకగా అఖిల్ సినిమా వస్తుందనుకున్న అభిమానులంతా సినిమా వాయిదా పడడంతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. ఈ నేపథ్యంలోనే సినిమాను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేస్తూ ‘అఖిల్’ టీమ్ ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశానికి అఖిల్ టీమ్‌తో పాటు కింగ్ నాగార్జున కూడా విచ్చేసి, సినిమా వాయిదా వేయడానికి వీఎఫ్‌ఎక్స్ పనుల్లో జాప్యమే కారణమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “‘బాహుబలి’ లాంటి ఓ విజువల్ వండర్ మన సినిమాల్లో వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చే సినిమాల్లో గ్రాఫిక్ వర్క్ అదే స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఇక అఖిల్ సినిమాలోనూ కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు పర్ఫెక్ట్‌గా రావడం కోసం టైమ్ పడుతోంది. ఈ గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగానే సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయలేకపోతున్నాం” అని తెలిపారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు నవంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు