మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఓవర్సీస్ మరియు ఆంధ్ర, తెలంగాణలలో నిన్న రాత్రి నుంచే ప్రీమియర్స్ షోస్ పడడం మొదలైపోయాయి. అందులోనూ ఓవర్సీస్ లో రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక లొకేషన్స్ లో, స్క్రీన్స్ లో బ్రూస్ లీ ని రిలీజ్ చేసారు. అందులోనూ సుమారు 500 ప్రీమియర్ షోస్ ని ప్లాన్ చేసారు. ప్రీమియర్ షోస్ తో బ్రూస్ లీ సినిమా అనుకున్న స్థాయి కలెక్షన్స్ ని సాధించకపోయినా డీసెంట్ కలెక్షన్స్ ని మాత్రం రాబట్టుకుంది.
యుఎస్ ట్రేడ్ రిపోర్ట్స్ చెప్పిన సమాచారం ప్రకారం బ్రూస్ లీ ప్రీమియర్ షోస్ నుంచి $277,176K కలెక్ట్ చేసింది. మిగతా వీకెండ్స్ కూడా ఇదే రేంజ్ లో కలెక్ట్ చేస్తే మొదటి వీకెండ్ పూర్తయ్యే లోపు 1 మిలియన్ మార్క్ ని టచ్ చేస్తుందని యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. బ్రూస్ లీ సినిమాలో చరణ్ పెర్ఫార్మన్స్, డాన్సులు, ఫైట్స్ లతో పాటు రకుల్ ప్రీత్ అందాలు ఆకట్టుకుంటే, చివర్లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా పెద్ద హెల్ప్ అయ్యాయి.


