ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన ‘కంచె’ టీమ్!

ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన ‘కంచె’ టీమ్!

Published on Oct 17, 2015 12:22 PM IST

kanche1
‘కంచె’.. టాలీవుడ్‌లో గత కొన్నాళ్ళుగా అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా. ఇండియన్ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వస్తోన్న మొట్ట మొదటి సినిమా కావడం, విలక్షణ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్‌ను సెట్ చేసుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం లాంటి అంశాలతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ కూడా అంద్భుతంగా ఉండడంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

ఇక మొదట దీపావళి కానుకగా నవంబర్ నెలలో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా, చివరి నిమిషంలో దసరా సీజన్‌కు వచ్చి చేరింది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా అక్టోబర్ 22న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక సినిమా అనుకోకుండా దసరా సీజన్‌కు వచ్చిపడడంతో రిలీజ్‌కు వారం రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ వీలైనంత మేర సినిమాను ప్రేక్షకులకు చేర్చడానికి ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేసింది. దర్శకుడు క్రిష్‌తో పాటు మిగతా టీమ్ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ దసరా సీజన్‌కు వచ్చే సినిమాల్లో కంచెకు ఓ ప్రత్యేకత ఉండడంతో ఈ సినిమా విజయంపై దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు