‘చీకటి రాజ్యం’కు హాలీవుడ్ టెక్నీషియన్స్

‘చీకటి రాజ్యం’కు హాలీవుడ్ టెక్నీషియన్స్

Published on Oct 17, 2015 5:47 PM IST

cheekati-rajyam
ప్రయోగాలకు పెట్టింది పేరైన విశ్వ నటుడు కమల్ హాసన్ తాజాగా ‘చీకటి రాజ్యం’ పేరుతో మరో కొత్త ప్రయోగం చేస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల చివరిదశలో ఉంది. ఇక రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ పనులో కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇదే విషయాన్ని కమల్ తెలియజేస్తూ ఫైనల్ మిక్సింగ్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోందని, సినిమా బాగా వచ్చిందని అన్నారు.

ఇక ఒకేఒక్క రాత్రి జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌తో పాటు త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం కమల్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట. తమిళంతో పాటు, తెలుగులోనూ తప్పక చేయాల్సిన సన్నివేశాలన్నీ రెండు సార్లు షూట్ చేశారట. ఇక తమిళంలో తూంగవనం పేరుతో రానున్న ఈ సినిమాను నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు