సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో పేరున్న ప్రొడక్షన్ హౌస్ శ్రీ సూర్య మూవీస్.. ఈ సంస్థ అధినేత అయిన ఎఎం రత్నం తన కుమారుడు ఎఎం జ్యోతి కృష్ణని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తరుణ్, త్రిష, శ్రియలతో చేసిన సినిమా ‘నీ మనసు నాకు తెలుసు’. ఈ సినిమా తర్వాత దాదాపు 12 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న జ్యోతి కృష్ణ తన తదుపరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. తన కమ్ బ్యాక్ ఫిలిం కోసం హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్ ని సెలక్ట్ చేసుకున్నాడు జ్యోతి కృష్ణ.
ఇటీవలే జ్యోతి కృష్ణ గోపీచంద్ ని కలిసి స్టొరీ లైన్ చెప్పినట్లు సమాచారం. గోపిచంద్ జ్యోతి కృష్ణ చెప్పిన లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఫుల్ స్క్రిప్ట్ ని సిద్దం చేసుకొని రమ్మన్నాడని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ ఫుల్ ప్లెడ్జ్ కామెడీ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ప్రస్తుతం జ్యోతి కృష్ణ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఫైనల్ స్క్రిప్ట్ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం గోపీచంద్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.


