‘రాజుగారి గది’ రన్ టైం అండ్ సెకండ్ పార్ట్ విశేషాలు

‘రాజుగారి గది’ రన్ టైం అండ్ సెకండ్ పార్ట్ విశేషాలు

Published on Oct 19, 2015 7:00 PM IST

Raju-Gari-kadha
బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ రియాలిటీ షోస్ చేసి మంచి పేరు తెచ్చుకున్న ఓంకార్, బుల్లితెర నుంచి ప్రమోషన్ తీసుకుంటూ డైరెక్టర్ గా మారి ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా సూపర్బ్ రిజల్ట్ ఇవ్వకపోయినా ఓంకార్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్ హర్రర్ కామెడీ అయిన ‘రాజుగారి గది’ సినిమాతో అక్టోబర్ 22న తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూడగానే బిగ్ ప్రొడక్షన్ హౌస్ లైన వారాహి చలన చిత్రం వారు, ఎకె ఎంటర్టైన్మెంట్స్ వారు కలిసి ఈ సినిమాని కొనుక్కొని, వారే సొంతంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

అలాగే రిలీజ్ కి ముందే మా టీవీ వారు 1.6 కోట్లకి శాటిలైట్ రైట్స్ కొనుక్కోవడంతో రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్న ఓంకార్ చాలా ఆనందంగా ఉన్నాడు. హర్రర్ కామెడీగా రానున్న ఈ సినిమాని స్పీడ్ స్క్రీన్ ప్లే తో 135 నిమిషాల్లో చెప్పనున్నారు. షార్ట్ రన్ టైం, స్పీడ్ స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద హెల్ప్ అవుతుందని ఓంకార్ అంటున్నాడు. అంతే కాకుండా ఇప్పటికే రాజుగారి గది సినిమాకి సీక్వెల్ కోసం సెకండ్ పార్ట్ కథని కూడా సిద్దం చేసాడట. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. అశ్విన్ ఓంకార్, ధన్య బాలకృష్ణ, చేతన్ చీను, శకలక శంకర్, ధన్ రాజ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు