‘బ్రూస్ లీ’ సక్సెస్‌తో హ్యాపీగా ఉన్న రామ్ చరణ్

‘బ్రూస్ లీ’ సక్సెస్‌తో హ్యాపీగా ఉన్న రామ్ చరణ్

Published on Oct 19, 2015 7:39 PM IST

ram-charan-interview
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్రూస్ లీ’. మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత తెరపై కనిపించిన సినిమా కావడంతో బ్రూస్ లీపై అంతటా విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలకు తోడు ఈ సీజన్‌లో వస్తోన్న సినిమాల్లో అతిపెద్ద సినిమా కూడా ‘బ్రూస్ లీ’నే కావడంతో మొదట్నుంచీ బ్రూస్ లీ క్రేజీ ప్రాజెక్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాల మధ్యన గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి.

ఇక సినిమాకు మొదటి షో నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం కొంత కలవరపరిచినా, కలెక్షన్స్ మాత్రం మొదటి వీకెండ్ బాగున్నాయి. ఈ నేపథ్యంలోనే తన సినిమాకు బాక్సాఫీస్ వద్ద వస్తోన్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. బ్రూస్ లీ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి రూపొందించిన సినిమా అని, టార్గెట్ ఆడియన్స్‌కు సినిమా బాగా నచ్చడం ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా తన యాక్టింగ్‌కు, కామెడీ టైమింగ్‌కు వస్తోన్న రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నానని రామ్ చరణ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కృతి కర్బంధ రామ్ చరణ్ అక్కగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు