‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.!

‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.!

Published on Oct 20, 2015 1:02 PM IST

nanaki-prematho-(1)
ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకి పొంత లేకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మరియు డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన 25వ సినిమా కోసం పూర్తి డిఫరెంట్ కథతో విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుకుమార్ ని డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే క్లాస్ టైటిల్ ని కూడా పెట్టారు. వినాయక చవితి కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎన్.టి.ఆర్ అభిమానులకు మరొక శుభవార్త తెలియజేయనున్నాం.

ఎన్.టి.ఆర్ తన అభిమానులకు దసరా కానుకగా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసాడు. ఇప్పుడు దానికి ఫైనల్ ముహూర్తం కూడా ఫిక్స్ చేసారు. దసరా కానుకగా అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు నాన్నకు ప్రేమతో ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే లాంగ్ లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం త్వరలోనే మరో మేజర్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనుంది. ఎన్.టి.ఆర్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్.టి.ఆర్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు