‘జిల్’ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ!!

‘జిల్’ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ!!

Published on Nov 21, 2015 7:36 PM IST

ram-charan-radakrishna
ఈ ఏడాది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకులలో రాధా కృష్ణ ఒకడు.. యాక్షన్ హీరో గోపీచంద్ తో రాధాకృష్ణ చేసిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జిల్’ తెలుగు ప్రేక్షకులను మెప్పించి మొదటి సినిమాతోనే హిట్ అందుకునేలా చేసింది. ప్రభాస్ ఫ్రెడ్స్ అయిన వంశీ కృష్ణ – ప్రమోద్ లు ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా తర్వాత రాధాకృష్ణకి రెండవ సినిమా ఆఫర్ ని కూడా యువి క్రియేషన్స్ ఆఫర్ ఇవ్వడంతో ఓ కథని తయారు చేసాడు. ఆ కథ ఎవరి కోసమంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కావడం విశేషం..

ఇక విషయంలోకి వెళితే.. రాధాకృష్ణ రామ్ చరణ్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే ఓ కథని సిద్దం చేసాడు. ఇటీవలే రాధాకృష్ణ చరణ్ ని కలిసి కథని వినిపించగా ఆయన కూడా సినిమాపై సముఖతగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరు 150వ సినిమా మరియు తని ఒరువన్ రీమేక్ వర్క్స్ ని ఫినిష్ చేసాక చరణ్ త్వరలోనే రాధాకృష్ణ – యువి క్రియేషన్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సురేందర్ రెడ్డి సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన వివరాల కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు