
బ్యూటిఫుల్ లవ్ స్టొరీ లేదా బరువైన కుటుంబ కథా చిత్రమ్ లేక ఓ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇలా ఏ సినిమాకి అయిన పర్ఫెక్ట్ గా సరిపోతాను అని నిరూపించుకున్న యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్ని చేస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘సరైనోడు(వర్కింగ్ టైటిల్)’. కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ మాస్ మసాలా మూవీస్ తీసే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకుడు. ఇటీవలే హైదరబాద్ లో లాంగ్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న ఈ చిత్ర టీం సినిమాకి కీలకమైన ఓ షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లి ప్రస్తుతం అక్కడ షూటింగ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ అండ్ టీం రాజమండ్రిలో సందడి చేస్తుంటే, ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ తన టీంతో హైదరాబాద్ లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం తమన్ రామజోగయ్య శాస్త్రితో కలిసి సరైనోడు కోసం సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇటీవలే ఓ ఫ్యామిలీ సాంగ్ ని కంపోజ్ చేసి ఇచ్చిన తమన్ ప్రస్తుతం ఫుల్ బీటున్న డ్యూయెట్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ – తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘రేసు గుర్రం’ ఆల్బమ్ ని మించి ఉండేలా తమన్ ఈ సినిమా ఆల్బంని రెడీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది, ఆదర్శ్ బాలకృష్ణలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

