శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో ప్రభంజనం సృష్టించిన ‘రోబో’కు సీక్వెల్ రూపొందించే పనిలో దర్శకుడు శంకర్ నిమగ్నమైన విషయం తెలిసిందే. రోబోకు ఎన్నో రెట్లు మించేలా విజువల్ వండర్‌గా ఈ సినిమాను నిర్మించేందుకు దర్శకుడు శంకర్ అన్ని విధాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న రోబో 2 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ విడుదల కాకపోవడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ హైలైట్‌గా నిలుస్తూ వస్తోంది.
ఇక ప్రస్తుతం ‘రోబో 2’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది. దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీ కాంత్‌లతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్వాహకులు, ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్‌పై ఎక్కువ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రోబో 2 నిలవనుందని లైకా సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలపడం విశేషంగా చెప్పుకోవచ్చు. తమ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టును అప్పజెబుతున్నందు ఈ సందర్భంగా లైకా సంస్థ నిర్వాహకులు శంకర్, రజనీలకు థ్యాంక్స్ తెలిపారు.