సలార్ బైక్ ను గెలుచుకున్న ఆ లక్కీ విన్నర్ ఇతనే!

సలార్ బైక్ ను గెలుచుకున్న ఆ లక్కీ విన్నర్ ఇతనే!

Published on May 2, 2024 10:47 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో ప్రసారం అయ్యింది.

అయితే స్టార్ మా ఛానెల్ వారు సలార్ బైక్ ను బహుమతి గా ఒక లక్కీ విన్నర్ కి అందజేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చిత్రం ప్రసారం అయ్యే టైమ్ లో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒకరిని సెలెక్ట్ చేశారు. నేడు ఆ విన్నర్ ను రివీల్ చేశారు. సలార్ బైక్ SMS కాంటెస్ట్ ద్వారా వరప్రసాద్ అనే వ్యక్తి బైక్ ను గెలుచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు