మణిరత్నం నెక్స్ట్ మూవీకి క్రేజీ కాంబినేషన్?

మణిరత్నం నెక్స్ట్ మూవీకి క్రేజీ కాంబినేషన్?

Published on Feb 9, 2016 4:05 PM IST

mani-rathnam-movie
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటుడు, నటి పని చేయాలనుకునే డైరెక్టర్ మణిరత్నం. ఆయన గత ఏడాది ‘ఓకే బంగారం’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన దల్క్వేర్ సల్మాన్ – కార్తీలతో ఓ మల్టీ స్టారర్ అనుకున్నాడు, కానీ అది కుదరలేదు, ఆ తర్వాత కార్తీ – నానితో అనుకున్నాడు, కుదరలేదు. ఇక ఫైనల్ గా నాగ చైతన్య – రానాలతో అనుకున్నాడు, అదీ ఆగిపోయింది, దాంతో ఆయన గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడా అన్నది తెలియదు.

గ్యాప్ తీసుకున్న ఈయన మళ్ళీ తన మార్క్ లో సాగే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి శ్రీకారం చుట్టాడు. దానికి కార్తీ అయితే పర్ఫెక్ట్ అని కథని కార్తీకి చెప్పడం తనకి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కార్తీ వేరే సినిమాలో బిజీగా ఉండడం వలన జూన్ నుంచి ఈ సినిమా మొదలవుతుంది. హీరోతో పాటు హీరోయిన్ ని కూడా ఓకే చేసాడు మణిరత్నం. గత ఏడాది మలయాళ సినిమా ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన సాయి పల్లవిని ఎంపిక చేసాడు, తను కూడా ఓకే చెప్పేసింది. ప్రస్తుతం మణిరత్నం ఈ సినిమా కథని ఫుల్ స్క్రిప్ట్ గా మార్చే పనిలో ఉన్నాడు. మరి ఈ సినిమా అన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా సెట్స్ మీదకి వెళ్తుందేమో చూడాలి.

తాజా వార్తలు