సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి.కల్యా ణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. విడుదల తేది దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ అయ్యాయి. రేపు ఈ సినిమా టిజర్ బాలయ్య విడుదల చెయ్యనున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆకుల శివ కథ మాటలు అందించారు.
త్వరలో విడుదల కానున్న ఈ సినిమా పాటలు బాగున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. ఈరోజు విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మంచి విజయం సాధించాలని కోరుకుందాం.


