సీనియర్ హీరో మోహన్ బాబు తాజా చిత్రం ‘గాయత్రి’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సినిమాలో మొదటి నుండి ఆసక్తిని రేకెత్తిస్తున్న మోహన్ బాబు పాత్రే ట్రైలర్లో సైతం హైలెట్ గా నిలిచాయి. కంచు కంఠంతో మోహన్ బాబు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ప్రతి ఒక్కటి బాగానే పనిచేసింది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ లో ఉండి చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
చిత్రంలో మంచి విష్ణు సాధారణ సగటు యువకుడిగా కనిపించగా శ్రియా శరన్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా నటించింది. అలాగే అనసూయ భరద్వాజ్ కథలో కీలకమైన జర్నలిస్ట్ పాత్రను చేయగా మలయాళం నటి నిఖిల విమల్ మరొక కీలక పాత్రలో కనిపించింది. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతన్ని అందించారు.


