ఇంటర్వ్యూ : మదన్ – మహానటుల జాబితాలో మోహన్ బాబుగారి పేరు కూడా ఉంటుంది !

ఇంటర్వ్యూ : మదన్ – మహానటుల జాబితాలో మోహన్ బాబుగారి పేరు కూడా ఉంటుంది !

Published on Feb 2, 2018 4:50 PM IST

మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘గాయత్రి’. మదన్ రామిగాని ఈ నెల 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమాకి ‘గాయత్రి’ అని పేరెందుకు ?
జ) చాలా విషయాలు కష్టమైనవి ఉంటాయి, ఇష్టమైనవి ఉంటాయి. అలా రెండు ముడిపడి ఉండేదే గాయత్రి. అలాంటి విభిన్నమైన అంశం ఈ సినిమాలో ఉంటుంది.

ప్ర) ఈ సినిమా కథేమిటి ?
జ) ఇది తండ్రి, కూతుళ్ళ సినిమా. పూర్తిగా వారి మధ్యన నడిచే కథ ఇది. ఇందులో గాయత్రిగా నిఖిల విమల నటించింది.

ప్ర) మరి గాయత్రి పటేల్ పాత్రేమిటి ?
జ) మోహన్ బాబుగారు చేసిన ఆ పాత్ర సినిమానాలో సప్రైజింగా ఉంటుంది. ఇప్పుడే దాన్ని రివీల్ చేయకూడదు. ఇంకో పాత్ర పేరు శివాజీ.

ప్ర) మరి విష్ణు పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) విష్ణు పాత్ర ఇద్దరు మోహన్ బాబుల్లో ఒకరికి యంగర్ వెర్షన్. అది ఎవరికి అనేది సినిమా చూసే తెలుసుకోవాలి.

ప్ర) మోహన్ బాబుగారు సీనియర్ హీరో. ఆయన్ను ఎలా డీల్ చేశారు ?
జ) ఆయన మహా నటుడు. అంతటి నటుడ్ని ఎలా హ్యాండిల్ చేయగలనా అనిపించేది. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, నాగశేశ్వరరావ్, శివాజీ గణేశన్ లాంటి మహానటుల జాబితాలో ఆయనుంటారు. ఆయనకు గొప్ప పాత్రలు రాయాలంతే.

ప్ర) ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) గర్వంగా ఉంది. ఆయన నాకు పిలిచి అవకాశం ఇచ్చారు. నేను చాలా లక్కీ. నాకు, ఆయనకు ఇంతకుముందు పెద్దగా పరిచయం కూడా లేదు. కేవలం ఒక్క సిట్టింగ్లో ఓకే చేసేశారు.

ప్ర) మోహన్ బాబుగారు కథలో ఇన్వాల్వ్ అయ్యారా ?
జ) అంటే ఆయనకిది రీలాంచ్ లాంటిది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉపయోగపడే సలహాలు ఎన్నో ఇస్తారు. మోహన్ బాబుగారు ఎవరు ఏ సలహా చెప్పినా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. అదే ఆయనలోని గొప్ప క్వాలిటీ.

ప్ర) సినిమా చూస్తుంటే కొంత పాతదిగా ఉందనిపిస్తుంది ?
జ) ఫ్యామిలీ డ్రామాల్లో కొత్త పాత ఉండదు. అన్నిటిలోను ఎమోషన్ ఉంటుంది. అవి ఎప్పుడైనా పండుతుంది. ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉండటం వలన మేకింగ్ కొంత పాతగా అనిపిస్తుంది.

ప్ర) 2006 నుండి 2017కి చాలా తక్కువ సినిమాలే చేశారు. కారణం ?
జ) ప్రత్యేక కారణం అంటూ ఏం లేదు. నేనెప్పుడూ రేసులో లేను. ఎందుకో అలా కుదిరేసింది.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాలేంటి ?
జ) అంటే ఇంకా స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను. ఏమీ ఫిక్స్ కాలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక సినిమా తప్పకుండా చేస్తాను. అది ఎవరితో అనేది ఇప్పుడే చెప్పలేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు