స్పీడ్ పెంచిన నాని అండ్ టీమ్ !

స్పీడ్ పెంచిన నాని అండ్ టీమ్ !

Published on Apr 9, 2018 2:39 PM IST


నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇది వరకే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని క్రియేట్ చేయగా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. హీరో నాని స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో, నాని ‘నిన్ను కోరి, ఎంసిఏ’ వంటి వరుస విజయాల తర్వాత చేసిన చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు మంచి స్థాయిలోనే ఉన్నాయి. అంతేగాక ఇందులో నాని ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఈ నెల 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ తెరకెక్కించగా సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు