బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి నటించాలని ఎవరుకోరుకోరు. కానీ ఆయనతో నటిచడం వల్లే తన కెరీర్ నాశనం అయ్యిందని అంటుంది బాలీవుడ్ నటి మహి గిల్. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ చిత్రంలో మహి ముఖ్య పాత్రలో నటించింది. 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని కూడా సాధించింది. కానీ ఈ సినిమా వల్లే తన కెరీర్ ఆగిపోయిందని ఆమె అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘దబాంగ్’ కు ముందు ‘దేవ్ డి’ అనే చిత్రంలో నటించాను. ఆ చిత్రానికి ప్రశంసలతో పాటు అభిమానులు మరిన్ని మంచి చిత్రాలు చేయాల్సిందిగా కోరారు. దాంతో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాలో ప్రతినాయకుడి ప్రేయసి పాత్రలో నటించాను. ఈ సినిమా తో నా కెరీర్ ఆగిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా తరువాత అన్ని చిన్న చిన్న పాత్రలు రావడం జరిగింది. దానికి నేను చాలా బాదపడ్డ. బహుశా నాకు ఇలాగ జరిగాలనిఉందేమో అని తెలిపారు.


