
యువ హీరో రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం యొక్క ఆడియో ను ఈరోజు డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదలచేశారు. ఇక ఈచిత్రం యొక్క ట్రైలర్ ను అక్టోబర్ 10న విడుదలచేయనున్నారు. అలాగే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుకను ఈ వారంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు . ‘నేను లోకల్’ దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి.

