నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు భారీ సినిమా ది ప్యారడైజ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంటుంది. అయితే ఈ సినిమా గ్యాప్ లో నాని తన కుటుంబంతో కొంత హ్యాపీ టైమ్ ని కూడా గడుపుతూ కనిపిస్తాడు. అలానే ఓ బ్యూటిఫుల్ పిక్ ని తను షేర్ చేసుకోవడం అభిమానుల్లో బెస్ట్ మూమెంట్ గా మారింది.
తన కొడుకు జున్ను ఒడిలో సేద తీరుతూ నాని ఇందులో కనిపించడం ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. అయితే నేడు జున్ను 9వ పుట్టినరోజు సందర్భంగా నాని ఈ బ్యూటిఫుల్ స్నాప్ ని షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ పిక్ మంచి వైరల్ గా మారింది. ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే ఈ సినిమాని అతి త్వరలోనే ఫినిష్ చేసి ఆగస్టు 27న గ్రాండ్ రిలీజ్ కి తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


