‘అతిలోక సుందరి’గా ఒక వెలుగు వెలిగిన ధ్రువతార శ్రీదేవి. ఐతే, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు, శ్రీదేవికి మధ్య సుమారు 24 సినిమాల సుదీర్ఘ ప్రయాణం ఉంది. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి సినిమాలు అద్భుత విజయాలు సాధించాయి. తన చివరి చిత్రం ‘మామ్’ ఆడియో వేడుకలో శ్రీదేవి తన కాళ్ళకు నమస్కరించి, “మళ్ళీ మనం కలిసి ఒక సినిమా చేద్దాం సార్” అని కోరినట్లు ఆయన తాజాగా చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ఇంకా మాట్లాడుతూ.. శ్రీదేవి లాంటి హీరోయిన్ మరొకరు లేరు. అలాంటి ఆమె దుబాయ్‌లోని ఒక హోటల్ బాత్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించడం చాలా దారుణం. ఆమె మరణం నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. అంతటి గొప్ప నటి, ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన అతిలోక సుందరి అలా వెళ్లిపోకూడదు. ఆమెలాంటి చావు మరెవరికీ రావొద్దు” అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.


