లేడీ గెటప్ లో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో !

లేడీ గెటప్ లో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో !

Published on Oct 8, 2018 11:25 PM IST

Super

తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘సూపర్ డీలక్స్’. త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కిస్తున్నాఈచిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుండగా రమ్యకృష్ణన్ , ఫహద్ ఫాజిల్ , మిస్కిన్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో విజయ్ సేతుపతి శిల్పా అనే లేడీ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిసేపటి క్రితం విడుదలైయింది. పోస్టర్ లో వున్నవిజయ్ సేతుపతి లేడీ గెటప్ లుక్ ఆకట్టుకుంటుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని డిసెంబర్ లో విడుదలచేయనున్నారని సమాచారం.

తాజా వార్తలు