లాస్ట్ అరగంట అరవింద అదిరిపోయిద్ది అట !

లాస్ట్ అరగంట అరవింద అదిరిపోయిద్ది అట !

Published on Oct 10, 2018 6:00 PM IST

NTR21

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న భారీ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం
‘అరవింద సమేత’లో లాస్ట్ అరగంట సినిమా వెరీ ఎమోషనల్ గా మరియు వెరీ ఇంట్రస్టింగ్ డ్రామాతో సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ తన మేకింగ్ స్టైల్ ను, తన రైటింగ్ స్టైల్ ను పూర్తిగా మార్చినట్లుగా కనిపిస్తోంది. తన మార్క్ కామెడీ మరియు ఎమోషన్ తో పాటు… మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించాడట.

ప్రధానంగా రివెంజ్ స్టోరీకి పూర్తి యాక్షన్ అంశాలను జోడించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవటానికి త్రివిక్రమ్ ప్రయత్నస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సినిమాలో బాగా హైలెట్ అవ్వుతుందట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు