ఎనర్జిటిక్ హీరో మల్టీస్టారర్ నిజమేనట ?

ఎనర్జిటిక్ హీరో మల్టీస్టారర్ నిజమేనట ?

Published on Oct 14, 2018 1:24 PM IST

ram dulquer salmaan

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే రామ్ ఈ చిత్రం విడుదల తరువాత వెంటనే మరో చిత్రం మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.

కాగా ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రామ్ నటించనున్నారని.. ఆ సినిమా మల్టీస్టారర్ గా రాబోతుందని.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో రామ్ తో కలిసి నటించనున్నారని గతంలోనే సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే దుల్కర్ సల్మాన్ ని ఇంకా చిత్రబృందం సంప్రదించలేదట. కానీ దుల్కర్ సల్మాన్ కి కథ వినిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నారు. త్వరలో అధికారిక ప్రకటించనున్నారని సమాచారం.

ఇక ‘హలో గురు ప్రేమ కోసమే’ లో కామెడీ హైలెట్ అవ్వనుందట. ఈ చిత్రంతో రామ్ మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం అని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

తాజా వార్తలు