
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గత కొంతకాలంగా వరుస పరాజయాల సతమమవుతున్నాడు. అయితే సాయిధరమ్ తేజ్ తన సినీ కెరీర్ ను సంబంధించి పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విషయంలో వెళ్తే.. మెగా ఫ్యాన్స్ కు తేజ్ ఓ సందేశం పంపారు. తనని మెగా అభిమానులు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని తెలిపారు. ట్విటర్ పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
తేజ్ పోస్ట్ చేస్తూ.. ‘గెలిచినప్పుడు వేలకుపైగా చేతులు చప్పట్లు కొడతాయి. ఓడిపోయినా.. మీ చప్పట్ల చప్పుడు తగ్గకుండా.. జయాపజయాలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు. ఈ మధ్య కాలంలో మీ అంచనాలను అందుకోలేకపోయానన్నది వాస్తవం. దానికి కారణాలను విశ్లేషించుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను తీసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మీరు నాపై చూపించే ఈ అభిమానమే నన్ను మానసికంగా దృఢంగా ఉంచి మంచి సినిమాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తోంది. ఎల్లప్పటికీ మీ అభిమానం కోరుకునే.. మీ సాయిధరమ్ తేజ్’ అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రియమైన మెగాభిమానులకు ?? pic.twitter.com/p9H6PzQyJs
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 13, 2018

